విలీన మండ‌లాల ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో స‌ర్వం కోల్పోయారు. ప్ర‌భుత్వం ఆదుకోక‌పోవ‌డంతో నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. వీరి దుర్భ‌ర ప‌రిస్థితిని స్వ‌యంగా చూసిన టిడిపి జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు గారు చ‌లించిపోయారు. బాధితుల‌కు స‌హాయం అందించాల‌ని చంద్ర‌బాబు గారు ఇచ్చిన పిలుపు మేర‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నా వంతుగా 4 ట‌న్నుల బియ్యం, 2 ట‌న్నుల కూర‌గాయ‌ల‌ను లారీతో పంపించాను. దాత‌లు, టిడిపి నేత‌లు స్పందించి వ‌ర‌ద పీడితుల‌కు స‌హాయం అందించాల‌ని కోరుతున్నాను.