తాడేపల్లి టీ డీ పీ కార్యాలయం ప్రారంభోత్సవం
మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించాను. ఈ సందర్భంగా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలకు పసుపు కండువాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించాను. వారంలో దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తాం. త్వరలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. అంతా కలిసి ఇగోలు పక్కన పెట్టి పనిచేయండి. మంగళగిరిలో పసుపు జెండా ఎగరేస్తున్నాం.